Headlines (Telugu):
-
“నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం చేయాలి: జంగా రాఘవరెడ్డి”
-
“పామాయిల్ ఉత్పత్తికి నర్మెట ఫ్యాక్టరీ, జూన్ నాటికి పూర్తి లక్ష్యం”
-
“రైతులకు లబ్ధి కలిగించేందుకు నర్మెట ఫ్యాక్టరీ త్వరితగతిన పనులు”
-
“ఆధునిక టెక్నాలజీతో నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం”
-
“జంగా రాఘవరెడ్డి సూచనలతో నర్మెట ఆయిల్ ఫ్యాక్టరీ పనులు వేగం”
నర్మెటఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: జంగా రాఘవరెడ్డి* _రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు.
నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ఆయిల్ ఫెడ్ అధికారులు జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు.
*ఈ సందర్భంగా చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో నిర్మించడం జరుగుతుందన్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు.. రిపైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇక్కడ నుంచే నేరుగా మార్కెట్‌లోకి పంపడం జరుగుతుందన్నారు* రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే జూన్ వరకు రైతులకు అందుబాటులో కి తెచ్చేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు.