Site icon PRASHNA AYUDHAM

నూతన మద్యం పాలసీపై దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది

IMG 20251013 WA0029 1

నూతన మద్యం పాలసీపై దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది

కామారెడ్డి జిల్లాలో 49 దుకాణాలకు 1502

 దరఖాస్తులు — అక్టోబర్ 27న డ్రా ద్వారా లైసెన్సుదారుల ఎంపిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 24

  రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ (2025–2027) ప్రకారం మద్యం దుకాణాల (A4 షాప్స్) లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 23తో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలకు 1502 దరఖాస్తులు అందాయి.

స్టేషన్‌ వారీగా చూస్తే — కామారెడ్డి 15 దుకాణాలకు 467 దరఖాస్తులు, దోమకొండ 8 దుకాణాలకు 317, ఎల్లారెడ్డి 7 దుకాణాలకు 236, బాన్స్వాడ 9 దుకాణాలకు 249, బిచ్కుందా 10 దుకాణాలకు 233 దరఖాస్తులు సమర్పించబడ్డాయి.

అక్టోబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు సిరిసిల్ల రోడ్డులోని రేణుకా దేవి కళ్యాణ మండపం లో జిల్లా కలెక్టర్ గారు డ్రా విధానంలో లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు అదే రోజు 1/6 వ వంతు లైసెన్స్ ఫీజు ను అక్కడ ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్ లో చెల్లించాలి.

దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఉదయం 9.30 గంటలకు హాల్ టికెట్‌తో హాజరుకావాలి. మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించబడవు అని ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు తెలిపారు.

Exit mobile version