బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఏడాదిన్నర వయస్సున్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో కలకలం రేగింది.
సమాచారం ప్రకారం, ఇంటి మొదటి అంతస్తులో ఆడుకుంటున్న సమయంలో చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన తల్లి షాక్తో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే స్థానికులు ఇద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, తల్లి కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.










