కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లును పరామర్శించారు.
ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వెంకటేశ్వర్లకు ప్రమాదం జరగడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా, వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరుపై కూడా చర్చించారు.
పార్టీ కార్యకలాపాలలో క్రియాశీలకంగా ఉండే నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.










