• తెలంగాణ సమాజానికి సేవలందించిన ఆచార్య జయశంకర్.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ .
• జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సభలో కలెక్టర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
• వడివిడిగా ఉన్నత విద్యార్ధిగా, ఉద్యమ నేతగా జయశంకర్ పోషించిన పాత్రను వివరించారు.
• జయశంకర్ అడుగుజాడల్లో ప్రజలందరూ సాగాలంటూ కలెక్టర్ పిలుపు.
• కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 6
తెలంగాణ సమాజానికి తన జీవితం అంకితం చేసిన త్యాగశీలి ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రశంసించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – “తెలంగాణ ప్రజల వెనుకబడిన స్థితిని గుర్తించి, చైతన్య పరచేందుకు తన విద్య, రచనలు, ప్రసంగాలతో ఉద్యమానికి ఊపిరిపోసిన మహానేత జయశంకర్. కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా వేలాది విద్యార్థులకు మార్గదర్శకుడయ్యారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చూపిన మార్గంలో మనమందరం సాగాలి” అన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు, సిబ్బంది, టీఎన్జీవో, టీజీవో నాయకులు పాల్గొన్నారు.