ఘనంగా: ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు…
మహబూబాబాద్ జిల్లా: తొర్రురు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న జయశంకర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సామాజిక సేవకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జయశంకర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను స్మరించుకున్నారు..
ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..”ఆచార్య జయశంకర్ సార్ జీవితమంతా విద్యారంగానికి, తెలంగాణ ప్రజల హక్కుల సాధనకే అంకితమయ్యారు. ఆయన కలలు కన్న తెలంగాణను గౌరవంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉంది అని పేర్కొన్నారు. జయశంకర్ ఆలోచనలు, సిద్ధాంతాలు కొత్త తరం యువతకు స్ఫూర్తిగా నిలవాలని వారు అన్నారు.