పోతంగల్ కలాన్ గ్రామంలో ఏసీఎల్ బి చందర్ నాయక్ పరిశీలన*

*పోతంగల్ కలాన్ గ్రామంలో ఏసీఎల్ బి చందర్ నాయక్ పరిశీలన*

 

 

కామారెడ్డి జిల్లా గాంధారి

ప్రశ్న ఆయుధం జూలై 01

 

గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామంలో మంగళవారం జిల్లా ఏ సి ఎల్ బి చందర్ నాయక్, ఆకస్మిక పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో ప్లాంటేషన్ వర్క్ ఏ విధంగా జరుగుతున్నాయని గ్రామ సెక్రెటరీ, మండల అధికారి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల మార్కు చేసి లబ్ధిదారుల ఇంటికి ముగ్గు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అటుపై అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి మధ్యాహ్న భోజన పథకమును మెనూ ప్రకారం అందజేస్తున్నార లేదా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్ లను ఇప్పటికే విద్యార్థులకు అందవలసిన యూనిఫాంలో ఇంకా స్టిచ్చింగ్ పూర్తి కాకపోవడంతో తొందరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి,ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మి నారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment