Site icon PRASHNA AYUDHAM

షాద్ నగర్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు అనర్హత వేటు వేయాలి పోలీస్టేషన్ లో ఫిర్యాదు

ఎమ్మెల్యే
Headlines :
  1. “షాద్ నగర్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్”
  2. “అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై ఫిర్యాదు”
  3. “షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై అనర్హత వేటు వేసేలా నిపుణుల డిమాండ్”
  4. “వెలమ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యే”
  5. “షాద్ నగర్ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి”

*పోలీస్టేషన్ లో ఫిర్యాదు*

జమ్మికుంట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం

వెలను సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక స్టేషన్లో శనివారం వెలమ సామాజిక వర్గ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలను సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ వెలమ కులస్తుల అంతు చూస్తామని బెదిరించడం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈవిధంగా ప్రవర్తించడం ఎంత మాత్రము సమంజనము కాదని, ఆయన వాడిన భాష వల్ల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారి అందరి మనోభావాలు దెబ్బతీయడమేనని అహంకార పూరితంగా ఒక సామాజిక వర్గంపై ఈ విధమైన దూషణలు , బెదిరింపులు చేయడం ఏమాత్రము ఉపేక్షించ తగినది కాదని ఈ వ్యాఖ్యలను జమ్మికుంట వెలమ సంఘం ఖండిస్తున్నా మన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన బాధ్యతా రాహిత్యమైన ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పై ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెలమ సామాజిక వర్గం నాయకుడు రాజేశ్వర్ రావు, సంపత్ రావు, సత్యనారాయణ రావు, ప్రభాకర్ రావు,తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version