మహిళా వైద్యురాలిపై అత్యాచారము మరియు హత్య దేశానికే సిగ్గుచేటు
కర్రోల్ల రవిబాబు రాష్ట్ర కార్యదర్శి ధర్మ సమాజ్ పార్టీ
సిద్దిపేట ఆగస్టు 17 ప్రశ్న ఆయుధం :
- ఎందరికో ప్రాణం పోయాల్సిన వైద్యురాలి ప్రాణాన్ని బలిగొన్న నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలని, కోల్కతాలో ఆర్జి కర్ ఆసుపత్రిలో ట్రైన్ డాక్టర్ గా పనిచేస్తున్న జూనియర్ వైద్యురాలిపై అర్ధరాత్రి సమయంలో మూకుమ్మడిగా జరిగిన అత్యాచారం ఆపై హత్య అత్యంత దుర్మార్గమైన విషయమని ఇది దేశానికే సిగ్గుచేటు అయిన విషయమని ఈ దుర్ఘటనని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు ధర్మ సమాజ్ పార్టీ గా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అర్థరాత్రి మహిళా ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగ గలిగినప్పుడు అప్పుడే నిజమైన స్వతంత్రమని నాటి మహనీయులు అన్నదానికి తూట్లు పొడుస్తూ ఈ దేశ అగ్రవర్ణ పాలకుల ఏలికలో నాటి నుండి నేటి వరకు వెలుగులోకి రానివి ఎన్నో, వేలుగులోకి వచ్చినవి కొన్ని మహిళలపై అత్యాచారాలు హత్యలు ముఖ్యంగా అణగారిన వర్గాల మహిళలపై ఎక్కువగా జరుగుతూ వస్తున్న తరుణంలో దేశ అగ్రవర్ణ పాలకులు ఈ దేశంలో మనిషికి మనిషి సహకారం అన్న సంఘ భావన, సోదర భావన కల్పించకుండా మనుషుల్లో మానసిక పరివర్తనకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్యన విభిన్నతను, బేషజాలను రెచ్చగొట్టడం, భూతల స్వర్గానికి బాటలు వేసే యువత ఉన్న దేశంలో ముఖ్యంగా యువతలో, ప్రజల్లో, అశాంతి, అభద్రత, మత్తు పదార్థాలను అరికట్టక పోవడం, అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ సేవించడం, మత్తు పదార్థాలు సేవించడం అడ్డుకట్ట వేయకపోవడం, అనేక చర్చనీయాంశమైన ఘటనలలో ఎక్కువగా రాజకీయ, ధనముతో మదమెక్కిన మరియు అధికార అండదండలతో ఎన్నో ఆకృత్యాలకు పాల్పడుతుండటం ఇప్పటికైనా ఈ దేశాన్ని ఏలుతున్న అగ్రవర్ణాలు సిగ్గుతో ఈ దేశ పాలన పగ్గాల నుండి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన అదే చట్టాలతో అనేక రాజకీయ సాధనాలతో నీరుగార్చటం జరుగుతున్నది. ఇప్పటికైనా ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.