ఎన్కె పల్లి దళిత యవకుడి పై హత్యయత్నానికి పాల్పడ్డ నిందితుల పై చర్యలు తోసుకొవాలి

● రాష్ట్ర ఎస్సీ,ఎస్టి కమిషన్ చైర్మన్ కు డిబిఎఫ్ వినతి

సిద్దిపేట సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం :

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం ఎన్కె పల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడైన నట్టల మనోహర్ ను కిడ్నాప్ చెసి హత్యయత్నానికి పాల్పడ్డ నిందితుల పై చర్యలు తీసుకొవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు దళిత బహుజన ఫ్రంట్(డిబిఎఫ్) వినతిపత్రం సమర్పించారు.డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, డిబిఎఫ్ వికారాబాద్ జిల్లా నేత సిద్ది ఈశ్వర్ లు శుక్రవారంనాడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తన కార్యాలయం లో కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన,డిబిఎఫ్ వికారాబాద్ జిల్లా నేత సిద్ది ఈశ్వర్ లు మాట్లాడుతూ
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం ఎన్కె పల్లి గ్రామం‌ ఎస్సీ కులానికి చెందిన నట్టల రత్నమ్మ కుమారుడు నట్టల మనొహర్ (23) కార్ డ్రైవింగ్ చెస్తూ జీవిస్తున్నారన్నారు.ఈ నెల 12 నాడు సాయత్రం తన విధులు ముగించుకొని తన స్వగ్రామానికి వస్తుండగా మార్గ మధ్యలో తాండూర్ పట్టణం లోని సింధూ జూనియర్ కాలేజి సమీపంలో మనొహర్ మూతికి బట్ట చుట్టి కారులో కిడ్నాప్ చేసి మిస్టర్ టి పాయింట్ వెనుకకు తీసుకపొయి కట్టెలతో,రాడ్లతో హింసించారన్నారు..నిందితులందరు ఎన్కె పల్లి గ్రామానికి చెందిన బిసి లైన బెతి రాజేందర్,బెతి మహెందర్,చిలుక బాలరాజు,బాస్కర్ గౌడ్,శ్రీ నివాస్,రాము లు పాత కక్షలతో హత్యాయత్నం చెశారన్నారు.బాధితుడి తల్లి రత్నమ్మ పిర్యాదు మేరకు తాండుర్ 1 టౌన్ పొలీసులు FIR no 255/24,తేది 23-9-24 నాడు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి నప్పటికి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించి,పునరావాసం కల్పించాలని కోరారు. నిందితుల పై తగిన చర్యలు తీసుకొవాలని జిల్లా, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తామని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ హమి ఇచ్చారని పులి కల్పన,ఈశ్వర్ లు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ యువ నేత పులి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now