బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాల్టీ కన్వీనర్ జలాల్
కొత్తగూడెం మున్సిపాలిటీలోని 8వ వార్డులో పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికురాలు బత్తుల ఓదెమ్మ మరణానికి మున్సిపల్ అధికారులే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్,సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మరణించిన బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఆసుపత్రి శవ పరీక్ష విభాగం (పోస్ట్ మార్టం రూమ్) ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే మున్సిపల్ అధికారులు సరిగా స్పందించలేదని వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు.ప్రాణాంతక మందు తాగినప్పుడు 24 గంటలైనా అత్యవసర విభాగంలో వెంటిలేటర్ పై ఉంచాలని కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేకపోయినా మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించకుండా అక్కడే అత్యవసర విభాగం నుండి జనరల్ వార్డుకు తరలించి అక్కడ వైద్యం చేయడం వల్లనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.ఇప్పటికే మున్సిపాలిటీలో ఇది రెండో ఘటన అని అయినప్పటికీ మున్సిపల్ అధికారుల పనితీరులో ఏ మాత్రం మార్పు రావడంలేదని కార్మికులకు రక్షణ సౌకర్యాలు వారి భద్రత పర్యవేక్షణలో అనేక లోపాలు ఉన్నాయని వారు విమర్శించారు.ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం,జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కార్మికుల రక్షణ,భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,మృతురాలి కుమార్తెలు సరోజ,నాగలక్ష్మీ,ఉషా,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు