ఎస్సీ ఎస్టీ లాకప్ హింస కు పాలు పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి

ఎస్సీ ఎస్టీ ల పై లాకప్ హింస కు పాల్పడుతున్న పోలీసుల పై చర్యలు తీసుకొవాలి.

జస్టిస్ చంద్రకుమార్

సిద్దిపేట ఆగస్టు 17 ప్రశ్న ఆయుధం :

అకారణంగా ఎస్సీ ఎస్టీ ల పై దొంగతనాలు నెపంతో ఎస్సీ ఎస్టీ మహిళల పై పిల్లలపై లాకప్ హింసలకు పాల్పడుతున్న పొలీసుల పై చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. శనివారంనాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో డిబిఎఫ్, డిఎల్ ఎఫ్ ల అధ్వర్యంలో 78 ఏళ్ళ స్వాతంత్ర్య పాలనలో ఎస్సీ ఎస్టీ ల పై ఆగని దాడులు,తెలంగాణ లో ఎస్సీ ఎస్టీ లపై లాకప్ హింసకు పాల్పడుతున్న పొలీసులను శిక్షించాలని డిమాండ్ చెస్తు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశం లో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ హొం మంత్రి గా బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి నిందితులైన పొలీసుల ను శిక్షించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పొరాటం చెస్తామన్నారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ,డిఎల్ ఎఫ్ నాయకులు మర్వాడి సుదర్శన్ లు మాట్లాడుతూ
దళిత,గిరిజనులను లాకప్ హింసకు పాల్పడ్డ రామడుగు,బషిరాబాద్ పోలీసుల పై కేసుల నమోదు చేయాలి.షాద్‌నగర్ సంఘటన లో పొలీసుల ను అరెస్టు చేయాలన్నారు. ఎరుకల యువకుడు కనకయ్యను చిత్రహింసలకు గురిచెసిన రామడుగు ఎస్.ఐ సురెంద్రబాబు పై కేసు నమొదు చెసి సస్పెండ్ చేయాలన్నారు. షాద్ నగర్ లో దళిత మహిళ సునీతను చిత్రహింసలకు గురి చేసిన డి.ఐ రాంరెడ్డి, కానిస్టెబుళ్ళను అరెస్టు చేయాలన్నారు. దళిత మహిళ కళావతిని హింసించిన బషిరబాద్ ఎస్.ఐ రమెష్ పై కేసు నమోదు చెసి సస్పెండ్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత,గిరిజనుల పై పోలీసుల దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయన్నారు..గత ప్రభుత్వం హయంలోదళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ నుండి మొదలై నేరళ్ళ దళితుల పై సాముహిక హింస వరకు 15 లాకప్ డెత్ లు చెశారన్నారు. ఇటివల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వత పోలీసు హింస పెరిగిపొతుందన్నారు.పోలీస్ లాఠీ,బూట్లు పెదల పై కరాళ నృత్యం చెస్యన్నాయన్నారు..పచ్చి బూతులు తిడుతు గ్రామీణ ప్రాంతం లో కొనసాగిన దొరల కుల దౌర్జన్యాలను గుర్తు చెస్తున్నాయన్నారు.
రామడుగు ఎరుకల కనకయ్య,షాద్ నగర్ ,బషీరాబాద్ దళిత మచెస్తున్నాునీత,కళావతి ల పై జరిగిన లాకప్ హింసల పరంపర కొనసాగుతున్నాయన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ మా ఏడవ గ్యారంటీ అని ప్రకటించిన ముఖ్యమంత్రి హొం మంత్రి గా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి మాటలు బుట్టదాఖాలయ్యాయన్నారు.ప్రెండ్లి పోలీస్ ముసుగులో ఎస్సీ ఎస్టీ ల పై యదెచ్చగా పొలీసులు చిత్రహింసలకు పాల్పడుతు 78 ఏళ్ళ స్వాతంత్ర్య పాలనను ప్రశ్నిస్తున్నారన్నారు.తెలంగాణ పోలీసులు జై భీమ్ సినిమాను తలపిస్తున్నారన్నారు. చట్టాన్ని చెతుల్లోకి తీసుకొని దోంగతనం నెపంతో వెలిచాల గ్రామానికి చెందిన కూలీ ఎరుకుల కనకయ్యను పలు మార్లు లాకప్ చిత్రహింసలకు పాల్పడ్డ కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్.ఐ సురేంద్ర బాబు పై కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి శాశ్వతంగా తోలగించాలని డిమాండ్ చెశారు.అదె విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్ అంబేద్కర్ కాలనీకి చెందిన గృహ కార్మికులైన దళిత మహిళ మల్కాపుర్ సునీత ఆమె భర్త భీమయ్య,మైనర్ బాలు డు జగదీష్ ల పై దొంగతనం నెపంతో ధర్డ్ డిగ్రీ కి పాల్పడ్డ సస్పెన్షన్ కు గురై కెసు నమో దైన నిందితులు డి.ఐ రామిరెడ్డి, ఇతర కానిస్టేబుల్ ల తక్షణమే అరెస్టు చేసి ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చెశారు..తాజగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్.ఐ రమేష్‌ కుమార్ నవల్గ గ్రామానికి చెందిన దళిత మహిళ కళావతి పై గత మూడు నెలలుగా హింసిస్తు పాశవిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు..రామడుగు ఎస్.ఐ సురెంద్రబాబు,బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ ల పై క్రిమినల్ కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చెశారు. చట్టం ప్రకారం బాధిత కుటుంబాలకు తక్షణ సహయం, నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చెస్తున్నాం. లాకప్ మరణాలను,చిత్ర హింసలను ఆరికట్టాలని కొరారు
అదేవిధంగా రాష్ట్రంలో యదెచ్చగా ఎస్సీ ఎస్టీ ల పై కొనసాగుతున్న దాడులు,దౌర్జన్యాల ను ఆరికట్టాలని డిమాండ్ చెశారు.

పొలీసులే మమ్మల్ని కొడితే మాకు దిక్కెవరు బాధితుల ఆందోళన
మమ్ములను కాపాడాల్సిన పొలీసులే మమ్ములను కొడుతుంటె మాకు దిక్కేవరని పొలీసుల చెతిలో హింసకు గురైన బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. షాద్‌నగర్ కు చెందిన దళిత మహిళ సునీత మాట్లాడుతూ ఆడమనిషిని అని చూడకుండా తన భర్త ,కొడుకు ముందె బట్టలు విప్పి చెడ్డి చెసి కొట్టారని కన్నీరు మన్నిరయ్యారు.నన్ను కొట్టిన డిఐ రామిరెడ్డి ఇతర పొలీసులకు శిక్షించాలని కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు కు చెందిన ఎరుకల కనకయ్య,అనిత దంపతులు మాట్లాడుతూ మాకు రామడుగు ఎస్.ఐ సురేందర్ బాబు తో తమ ప్రాణాలకు హని వున్నందున ఎస్. ఐ పై చర్యలు తీసుకొవాలన్నారు.నేరెళ్ళ బాధితులు మహెష్,బాణయ్య లు మాట్లాడుతూ ప్రభుత్వం మారితె మాకు న్యాయం జరుగుతదని నమ్మమని కాని మా పై హింస కు పాల్పడిన పొలీసులకు శిక్షలు పడటం లేదన్నారు. కొనరావుపృట కు చెందిన జర్నలిస్డులు కర్ణకర్,నరెష్,ఫ్రసాద్ లు తమ పై అన్యాయంగా కేసుల పాలు చెశారన్నారు.ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రపొసర్ లక్ష్మణ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు బాలరాజు,రొహిత్,జంగయ్య,కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబుదళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మర్వాడి సుదర్శన్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, వివిధ సంఘాల నాయకులు రాంప్రసాద్, శివలింగం, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now