దాచారం గ్రామంలో కుల దురఅహంకారంతో దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

◆ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్.

గజ్వేల్ సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో నిన్న దళితులపై జరిగిన దాడి అమానుషమని గణేష్ నిమజ్జనం సందర్భంగా కుల అహంకార పెత్తందారులు దళితులను దుర్భాషలాడుతూ మీరు మా కంటే గణేష్ నిమజ్జనం ముందు చేస్తారా మీరు తక్కువ కులం వారు మాదిగ జాతికి చెందినవారు మేమే మీపై చేయి సాధించాలి అనే నెపంతో వారిపై భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ఈ సందర్భంగా దాచారం గ్రామంలోని దాడికి గురైన దళితులను కెవిపిఎస్ జిల్లా కమిటీ పరామర్శించడం జరిగింది. ఆధునిక కాలంలో దళితులకు దేవుడిని పూజించే అర్హత కూడా లేదంటూ ఈ సంఘటన కుల అహంకార వ్యక్తులు చేసిన దాడి స్పష్టం చేసిందంటూ కెవిపిఎస్ జిల్లా కమిటీ విచారం వ్యక్తం చేసింది. నిన్న జరిగిన సంఘటన దళితులపై నేటికి కొనసాగుతున్నటువంటి కులరక్కసిని, కుల ఉన్మాదుల దాస్టికాన్ని తెలియజేస్తుందని అన్నారు. గ్రామంలోని అలేశారం కరుణాకర్ యాదగిరి, బాబు ,మధు అక్కడున్నటువంటి జూపల్లి సురేష్, మహేష్, అనిల్ కొంతమంది పెత్తందారుల అండతో వారిపై దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడడం దళితులపై వారికున్నటువంటి చిన్న చూపు వివక్షను తెలియజేస్తుందని అన్నారు. కాబట్టి దీనిపై అధికారులు వెంటనే స్పందించి దాడికి పాల్పడినటువంటి కుల ఉన్మాదుల పై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మరాటి కృష్ణమూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి దర్శనం రమేష్ , మర్కుక్ మండల అధ్యక్షుడు దాసు, గజ్వేల్ మండల నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now