విద్యార్థుల తల్లిదండ్రులను చీటింగ్ చేసిన కారుణ్య హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

విద్యార్థుల తల్లిదండ్రులను చీటింగ్ చేసిన కారుణ్య హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలి…

పి డి ఎస్ యూ

 

నిజామాబాద్ సెప్టెంబర్ 17 (ప్రశ్న ఆయుధం)

 

హైదరాబాదుకు చెందిన NSR impulse కార్పొరేట్ స్కూల్ పేరుతో కారుణ్య హైస్కూల్లో కొందరి అధికార పార్టీ వ్యక్తుల అండతో విచ్చలవిడిగా అడ్మిషన్లు చేపట్టారని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు,

ఈ సందర్భంగా కారుణ్య హైస్కూల్ ఆగడాలకు వ్యతిరేకంగా స్కూల్ 

 ముందు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన స్కూల్ పేరుతోనే అడ్మిషన్స్ చేయాలి కానీ

వాటికి విరుద్ధంగా అడ్మిషన్స్ తీసుకున్నారని, కారుణ్య స్కూల్ ఆవరణలో మరియు బస్సులకు బుక్స్ యూనిఫామ్స్ కి

హైదరాబాద్ కు చెందిన స్కూలు పేర్లు మరియు బోర్డ్స్ పెట్టారని ,

అనుమతి లేని హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ పేరుతో అడ్మిషన్లు చేసి ఫీజుల దోపిడికి పాల్పడ్డారని, 

అడ్మిషన్ ఫీజు ట్యూషన్ ఫీజు పుస్తకాలు యూనిఫామ్ రకరకాల పేర్లతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని, అర్హత లేని టీచర్స్ తో పాఠాలు చెప్పిస్తున్నారని,

కానీ సౌకర్యాలు లేకుండా నడుపుతున్నారని, గ్రౌండ్ , ఫైర్ లేవని అన్నారు.

సంబంధిత విద్యాశాఖ అధికారులు కూడా వీరికి వత్తాసు పలుకుతున్నారని, వెంటనే స్కూల్ యాజమాన్యం పైన చీటింగ్ కేసు నమోదు చేయాలని లేని యెడల జిల్లా కలెక్టర్ గారిని కలుస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు నికిల్,సాయికిరణ్, ప్రసాద్,వంశీ,రాజు ,అజయ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment