Site icon PRASHNA AYUDHAM

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి 

IMG 20250725 WA0486

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి

 

– టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 25

 

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిపిసిసి ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, శుక్రవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై భువనేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం

జరిగిన ప్రెస్ మీట్ లో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎటువంటి ఆధారాలు లేకుండా అనుచితమైన ఆరోపణలు చేయడం జరిగిందనీ, ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పరువునకు భంగం కలగడమే గాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మా యొక్క మనోభావాలకు తీవ్ర భంగం జరిగింది. ప్రెస్ మీట్ లో అనుచిత వాక్యాలు చేసినా కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్లు పంపరి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, పిడుగు మమతా సాయిబాబా, తైబ సుల్తానా సలీం, రంగ రమేష్, అరవింద్, శ్రీకాంత్, కిరణ్, శ్రీను,యూత్ సభ్యులు మున్నా, శశి, పండు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version