పార్కు స్థలాల కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేత
బి.యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కాలని వాసులు
వనస్థలిపురం, అక్టోబర్ 14: ( ప్రశ్న ఆయుధం) ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ శ్రీపురం కాలనీలో కబ్జా గురైన చత్రపతి శివాజీ పార్కును పరిరక్షించాలని కోరుతూ మంగళవారం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కాలని వాసులతో కలిసి రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలోని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లో శ్రీపురం కాలనీ ఉంది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 200 లో ఈ కాలనీ ఉంది. 1967 లో కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేసిన సందర్భంలో 5000 గజాల స్థలాన్ని పార్కు కోసం, కమిటీ హాల్ కోసం, క్రీడా ప్రాంగణం కోసం స్థలాలను వదిలిపెట్టడం జరిగింది. అట్టి స్థలాన్ని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన వారిపై, చేసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాలనీ అధ్యక్షుడు కాల్వ శ్రీధర్ రెడ్డి, కల్లు విష్ణువర్ధన్ రెడ్డి, రాజేందర్, చిగురింత శ్రీధర్ రెడ్డి, జెల్ల రాములు తదితరులు ఉన్నారు.