*స్మశాన వాటిక దారి భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలి*
*స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం*
*సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్*
*జమ్మికుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*
స్మశాన వాటిక దారి కబ్జాకు గురైన స్థలంపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమని సామాజిక కార్యకర్త సిలువేరు శ్రీకాంత్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ పక్కన సర్వే నెంబర్ 793/A/2, 793/B లలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు ఉన్నదారిని కబ్జా చేసి గోడ నిర్మాణం చేశారనీ ఆయన తెలిపారు. గతంలో దీనిపై రెవెన్యూ అధికారులు అక్కడ బోర్డును ఏర్పాటు చేసి తొమ్మిది ఫీట్ల దారి స్మశాన వాటికకు ఉంచాలని చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును సైతం తొలగించి స్మశాన వాటిక దారిని కబ్జా చేసి గోడ నిర్మాణం చేశారనీ దీనిపై హుజురాబాద్ ఆర్డిఓ జమ్మికుంట తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా బుధవారం తహసిల్దార్ స్మశాన వాటిక దారి కి సంబంధించి ఎంపీఆర్ గార్డెన్ ఓనర్ ప్రకాష్ రెడ్డిని పిలిచి ఇది స్మశాన వాటిక దారిని ఎందుకు కబ్జా చేశారని అడిగారనీ ఈ బోర్డును ఎవరు తొలగించారని అడిగితే సమాధానం చెప్పడం లేదనీ తెలిపారు. దీనిపై చర్యలు తీసుకొని స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయక పోయినట్లయితే ఆమరణ నిరాహార దీక్షకు చేయడానికి వెనుకాడనని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ బాబు ఆర్ఐ శంకర్ సర్వేయర్ మనోజ్ తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.