పేదల బియ్యం పక్కదారి డీలర్ పై చర్యలు శూన్యం

పేదల బియ్యం పక్కదారి

డీలర్ పై చర్యలు శూన్యం

ప్రశ్న ఆయుధం 11 మార్చి (బిచ్కుంద ప్రతినిధి)

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందజేస్తున్న రేషన్‌ బియ్యం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో పక్కదారి పడుతున్నాయి. తరచూ టాస్క్‌ఫోర్స్‌, పౌరసరఫరాల శాఖ, పోలీస్ శాఖ దాడులు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. కాగా బిచ్కుంద మండలకేంద్రంతో పాటు గుండెకల్లుర్ గ్రామంలో రేషన్ దుకాణాల్లో భారీ ఎత్తున బియ్యం పక్కదారి పడ్డాయని సదరు ఆ రేషన్ డీలర్ పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రేషన్ దుకాణం 20 లో సుమారు 60 క్వింటాళ్ల వ్యత్యాసం మరియు గుండెకల్లుర్ గ్రామంలో సుమారు 50 క్వింటాళ్ల వ్యత్యాసం ఉన్నట్లు కీలక సమాచారం. అదేవిధంగా గుండెకల్లుర్ గ్రామంలో నూతన డీలర్ కు ఇంచార్జీ ఇవ్వకుండా ఓ అధికారి అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. అంతేగాకుండా సదరు ఈ డీలర్ ప్రజల నుంచి వేలిముద్రలు తీసుకొని బియ్యం ఇవ్వలేదని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా ఈ డీలర్ పై అభియోగాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. అక్రమాలకు పాల్పడిన సదరు ఆ రేషన్ డీలర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment