అనుమతుల్లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి
– విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారికి వినతి పత్రం అందజేత
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎస్ ఎఫ్ ఐ, బి వి ఏం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో EAPCET, NEET, పేరిట కోచింగ్ సెంటర్లు నడుపుతూ ఒక్క విద్యార్థి నడి 45 రోజుల శిక్షణకు పదివేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మూదాం అరుణ్ కుమార్, బి వి ఏం రాష్ట్ర కార్యదర్శి జివిఎం విఠల్, వినోద్, రాహుల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.