కుల వివక్షత పాటించిన వారిపై చర్యలు తప్పవు

కుల వివక్షత పాటించిన వారిపై చర్యలు తప్పవు

ఎండి పాహెద్ గిర్దవరి

కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి

జగదేవపూర్ ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని నిర్మల్ నగర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో జగదేవ్పూర్ గిర్దవరి ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినంలో ముఖ్య అతిథిగా హాజరై కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ మనుషులందరూ సమానమే అని కుల వివక్షత పాటించ వద్దు అని అన్నారు. కుల రహిత సమాజం కోసం ఆకుల దినం జరుపుతున్నామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు కుల వివక్షత పాటించే వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తారని అన్నారు. కులాల మధ్య సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుభాష్ పంచాయతీ కార్యదర్శి మమత అంగన్వాడి టీచర్ అనిత ఆశా వర్కర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now