*కార్యకర్తలే శక్తి… పోరాటమే రాజకీయ దిశ*
*మదన్ అన్న నాయకత్వాన్ని హైలెట్ చేసిన బ్రాహ్మణపల్లిలో ప్రజల తీర్పు స్పష్ట సంకేతం*
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 20 కామారెడ్డి జిల్లా
గాంధారి మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి నూతన సర్పంచ్ బిసా గణేష్ రాజకీయాల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా నిలబడి, వెనుకడుగు వేయకుండా ముందుకు నడిపించిన నాయకత్వం మదన్ అన్నదేనని ఎమ్మెల్యే స్పష్టంగా హైలెట్ చేశారు. గెలుపే లక్ష్యంగా కాకుండా ప్రజల నమ్మకమే లక్ష్యంగా రాజకీయాలు చేసే అరుదైన నాయకుడు మదన్ అన్న అని ఆయన కొనియాడారు.
ఒత్తిళ్లు, నిరాశలు ఎదురైనా కార్యకర్తల చేతిని వదలకుండా ధైర్యం నింపిన నాయకత్వమే ఈ ఘన విజయానికి మూలమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యకర్తల శ్రమ లేకుండా రాజకీయాల్లో విజయం సాధ్యం కాదని, ఈ ఫలితం దానికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు.బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయాలకు స్పష్టమైన సందేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటు అనేది అమ్ముడుపోయే వస్తువు కాదని, అభివృద్ధి–నమ్మకాలకు వేసే ముద్ర అని బ్రాహ్మణపల్లి ప్రజలు నిరూపించారని తెలిపారు. భారీ మెజారిటీ ప్రజల పరిపక్వ ఆలోచనకు అద్దం పడుతోందని అన్నారు.
ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబానికి, ప్రతి ఓటరుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి ప్రజలు చూపిన విశ్వాసం తనపై మరింత బాధ్యతను మోపిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
“ఇది వ్యక్తుల గెలుపు కాదు… సిద్ధాంతాల గెలుపు. ఇది కష్టపడే కార్యకర్తల గెలుపు. ఇది ప్రజల గెలుపు” అంటూ ఎమ్మెల్యే రాజకీయంగా బలమైన సందేశం ఇచ్చారు. బ్రాహ్మణపల్లి అభివృద్ధి కోసం ఇకపై మరింత దూకుడైన కార్యాచరణతో ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.
ఈ విజయం బ్రాహ్మణపల్లి వరకే పరిమితం కాదని, రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మార్పులకు ఇది నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి