*మినిస్టర్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం..*
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): కార్యకర్తలే పార్టీకి బలం అని ప్రతి నాయకుడు కార్యకర్తలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ కొండా సురేఖ, పీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. మంగళవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు ఇరువురు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విరివిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రతి వాడలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను సేకరించి తీసుకురావాలని కోరారు. అసెంబ్లీ పూర్తవుగానే ఎస్డిఎఫ్ నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పనులను కార్యకర్తలకే కేటాయించేలా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి నాయకుడు కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుండాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు అవకాశాలు కల్పించి వారిని నాయకులుగా తయారు చేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే ప్రజల మద్దతు లభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎంపీ కాంటెస్ట్ కాండేట్ నీలం మధు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.