*న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తాను*
*నిరుద్యోగులకు అండగా ఉంటా ప్రతి పట్టభద్రునికి ఒక రూపాయికే హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా*
*కరీంనగర్ అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం)*
కరీంనగర్ లొ జిల్లా న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులతో సర్దార్ రవీందర్ సింగ్ కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసి తనకు మద్దతును ఇవ్వాలని కోరారు సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం ఇదే కరీంనగర్ కోర్టు నుండి ప్రారంభం అయిందని ఈ సమాజంలో గుర్తింపును రాజకీయంగా ప్రోత్సాహం కూడ ఈబార్ అసోసియేషన్ నాకు ఇచ్చిందని ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడ ఈ బార్ సభ్యుల సహాకరం అలాగే ఉండాలని కోరుతున్నానాని వారు అన్నారు బాధ్యత కలిగిన పౌరునిగా ఓటు హక్కును వినియోగించుకోవడం మన ప్రాదమిక హక్కు మీరు వేసే ఓట్లు పట్టభద్రుల జీవితాలలో ఒక భరోసా కల్పిస్తుందని 2021 నవంబర్ లోపు డిగ్రీ పూర్తి అయినా వారందరూ వచ్చే నెల అరోవ తారీకు లోపు పట్టభద్రులు ఓటరుగా నామోదు చేయించుకోవాలి కోరారు అన్ని అన్ లైన్ సెంటర్లలో ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకెళ్లి ఆన్లైన్ లో ఎంట్రీ చేసుకోవాలని తెలియజేశారు డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లు గా నామోదు చేసుకోవాలని లాస్ట్ ఎమ్మెల్సీలు నామోదు చేసుకొని ఓట్లు వేసినవారు కూడ మళ్ళీ నామోదు చేసుకోవాలని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా మిలో ఒకడిగా నాకు ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యల మీద ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా వాటి పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తానని ఈ నాలుగు జిల్లాలకు చెందిన పట్టభద్రుల నిరుద్యోగుల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని అన్నాడు కరీంనగర్ నిజామాబాద్, మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతిఒక్క పట్టభద్రుడికి దేశంలో ఎక్కడ లేనటివిధంగా కేవలం ఒక్క రూపాయకే హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాను ఎందుకంటే నిరుద్యోగులు ప్రయివేట్ ఉపాధ్యాయులు, డిగ్రీలు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు లేక ఇతర ప్రయివేట్ సంస్థలలో పనిచేసే వారి సమస్యలు నాకు తెలుసు చాలీచాలని జీతాలతో వారు జీవితాన్ని నెట్టుకోస్తున్నారు అలాంటి వారికి వారు పనిచేసే ఏసంస్థ కూడ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు అలాంటి పరిస్థితిలో వారికి అరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అ కుటుంబం అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అందుకే నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారందరికీ కేవలం ఒక్క రూపాయికే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి వారికి ఒక భరోసా కల్పిస్తునాని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు సర్దార్ రవీందర్ సింగ్ కు సన్మానం చేసి న్యాయవాది సుంకె దేవకిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఖర్చులకు 10116/- విరాళాలం అందించారు ఈ కార్యక్రమంలొ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలు రాజుకుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు, న్యాయవాదులు అనీల్, తవుటు మురళి, పురెల్ల రాములు, విక్రం, సాదవేణి వినాయ్, మిరియల్ కర్ మునిందర్, కనకం వంశి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.