వరంగల్: ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరం: ఆదనవు కలెక్టర్
వరంగల్ జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం అవసరమని ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. రుణ లక్ష్యాలు బ్యాంకర్లు పూర్తి చేయాలని కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి డీసీసీ సమావేశం జరిగింది. వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు.