టీ త్రాగుతున్నారా వీలైతే ఇవి కలపండి
టీ లో అల్లం కలిపి వాడండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ,అల్లం కలిపిన చాయ్‌ని తాగితే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి. గొంతులో నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
టీ తయారీలో యాలకులను వాడండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. యాలకుల్లో ఉండే రైబోఫ్లేవిన్, నియాసిన్‌లతో నోటి సమస్యలు తగ్గుతాయి. నోట్లో పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.జీర్ణశక్తిని సైతం పెంచుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది.
టీ లో దాల్చిన చెక్క వేస్తే యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ అదుపులో ఉండి, గుండె ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రాదు.
టీ లో తులసి ఆకులను వేసుకోండి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు రావు ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
టీలో పసుపు వేసి టీ తయారు చెయ్యండి . పసుపులో కర్‌క్యుమిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్‌లాపనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు. కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమన కలుగుతుంది.
సోంపు గింజలతోనూ టీ తయారు చెయ్యొచ్చు దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది ,
ఇంకేం మీకు పైన చెప్పిన వాటిలో ఏది అందుబాటులో అంటే అవి వేసుకొని టీ కలుపుకోండి ఆరోగ్యం మంత్రం జపించండి