ప్రజావాణిలోకి 87 ఫిర్యాదులు చేరిక

ప్రజావాణిలోకి 87 ఫిర్యాదులు చేరిక

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 17 :

 ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈసారి మొత్తం 87 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వెల్లడించిన సమస్యలను సంబంధిత శాఖాధికారులకు వెంటనే అందజేసి, తక్షణమే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడంతో, ప్రతి దరఖాస్తును సీరియస్‌గా పరిశీలించి అర్హులైన వారికి ఇళ్ల నిర్మాణాలకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.          ప్రజావాణిలో విద్యా, వైద్యం, మిషన్ భగీరథ, విద్యుత్, జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ (DWO), RTC, భూభారతి, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన వివిధ ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనీ కలెక్టర్ ఆదేశించారు.  తహసిల్దార్లతో మాట్లాడిన కలెక్టర్ భూభారతి, రెవెన్యూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలనీ, అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజూ పర్యవేక్షించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ సూచించారు.ప్రజావాణిలో జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now