రద్దీ దృష్ట్యా విశాఖ గుణుపూర్ పాసింజర్ స్పెషల్ రైలుకు అదనపు కోచ్..

రద్దీ దృష్ట్యా విశాఖ గుణుపూర్ పాసింజర్ స్పెషల్ రైలుకు అదనపు కోచ్..


ఆంధ్రప్రదేశ్ డెస్క్ శ్రీకాకుళం
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుభవార్త తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లకు అదనపు కోచ్ లను పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్(08522) ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను పెంచనుంది. ఈ రైలుకు పొందూరు, దూసి, శ్రీకాకుళం రోడ్డు, కోటబొమ్మాళి, టెక్కలి, పాతపట్నం వంటి పలు స్టేషన్లలో ఆగనుంది.

Join WhatsApp

Join Now