ముంపు గ్రామస్తులకు న్యాయం చేస్తాం…
ములుగు ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం :
కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామమైన మామిడాల గ్రామస్తులు ములుగు తహసీల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతి పత్రం అందించారు.. కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామమైన మామిడి గ్రామస్తులు తమకు పరిహారం కింద ప్యాకేజీలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు రాలేదని సోమవారం ములుగు తహసీల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతి పత్రం అందజేశారు. వారు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో మాట్లాడుతూ మాకు ఏడు సంవత్సరాలు నుండి రేపు మాపు అని టైం పాస్ చేస్తున్నారని, న్యాయంగా మాకు రావాల్సిన పరిహారాన్ని మాకు అందించాలని అడిషనల్ కలెక్టర్ ను కోరారు. ఇప్పటికీ చాలాసార్లు సంవత్సరాల నుండి ఎమ్మార్వో ఆర్డీవో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి మేము అలసిపోయామని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మా యందు కనికరపడి మాకు పరిహారం ఇప్పించాలని వారు అన్నారు. మేము పుట్టిన స్థలం, మా పెద్దలు సంపాదించిన స్థలాన్ని కోల్పోయిన న్యాయం చేయరా అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అనర్హులైన చాలామందికి ప్యాకేజీలు ఇల్లులు ఇచ్చారని అర్హులమైన మాకు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదని గ్రామంలోని పెద్ద మనుషులు వారికి సంబంధించిన వారికి మాత్రమే పరిహారం ఇప్పించారని వారు అన్నారు. న్యాయబద్ధంగా మేము పోరాడుతున్నామని మాకు కచ్చితంగా మాకు రావాల్సిన పరిహారం ప్యాకేజీలు ప్రభుత్వం అందించాలని వేడుకున్నారు. గ్రామం కాళీ చేసే సమయంలో అధికారుల మాటలు విని మేము కాళీ చేశామని అయినా కూడా మమ్మల్ని ఇప్పుడు గుర్తించడం లేదని వారు అన్నారు. గ్రామంలోని పెద్దమనుషులు మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని కొండపోచమ్మ సాగర్లో ముంచారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా మాకు న్యాయబద్ధంగా ప్యాకేజీలు ఇప్పించాలని సిద్ధిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అమీదుతో తో గోడు వెళ్లబుచ్చుకున్నారు. కొండపోచమ్మ సాగర్ మంటూ గ్రామస్తులకు న్యాయం చేస్తాం
అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ములుగు తాసిల్దార్ కార్యాలయంలో పంపు బాధితులతో మాట్లాడారు త్వరలో మీ సమస్యలను తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎవరు అధైర్య పడద్దని అందరికీ సమన్యాయం చేస్తామని అన్నారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మార్వో
సోమవారం ఎమ్మార్వో ఆరిఫా తో ముంపు బాధితులు ప్యాకేజీల గురించి చర్చించగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఆర్ డి ఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.