అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
– అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా గ్రంధాలయ శాఖ చంద్రకాంత్ రెడ్డి
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమేనని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ నాయక్, జిల్లా గ్రంధాలయ శాఖ చంద్రకాంత్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయల సాధనకు కృషి చేసి,
ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. అందరికీ న్యాయం జరిగేలా అంబేద్కర్ ఆలోచనల స్పూర్తితో ముందుకు సాగుతున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రిజర్వేషన్ ఫలాలు పదవులను అనుభవిస్తున్నామన్నారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని తెలిపారు.
దళిత నాయకులను చూసి ఓర్వలేని బిజెపి నాయకులు
ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ దళిత నాయకుడు కావడంతో పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా పదేపదే అంబేద్కర్ పేరు ఎందుకు తరుస్తారని తనలో ఉన్న అక్కుసాన్ని కక్కారని అన్నారు. బహుజన నాయకుల కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీ దూరంగా ఉండటం వారి అహంకార ధోరణికి నిదర్శనం అన్నారు. దేశ ఆర్థిక స్థితిని మార్చివేసిన అంబేద్కర్ ఫోటోను చూసి తన అక్క సును కక్కారన్నారు. మీద గ్రామాలలో గ్రామసభలు నిర్వహించిన సమయంలో పోలీసులు అగ్రవర్ణాల ప్రజలను సైతం సమావేశానికి పిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి దయానంద్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, బహుజన సంఘ నాయకులు కొత్తపల్లి మల్లయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, ఎమ్మార్పీఎస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తల్ల గంగారం, వివిధ సంఘాల నాయకులు సహాయ సంక్షేమ అధికారి వెంకటేష్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంక్షేమ అధికారులు, గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు వినోద్ నాయక్, కళాజాత బృందం తదితరులు పాల్గొన్నారు.