సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రశ్న ఆయుధం న్యూస్ పేపర్ లో బుధవారం ప్రచురితమైన *“సమస్యల వలయంలో సంగారెడ్డి పెద్దాసుపత్రి”* కథనాన్ని జిల్లా అధికారులు గమనించి స్పందించినట్లు తెలుస్తోంది. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాల శుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని త్వరితగతిన వినియోగంలోకి తేవాలని సూచించారు. వికలాంగులు సదరన్ క్యాంపు సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి ఆసుపత్రిని పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: October 29, 2025 8:16 pm