Site icon PRASHNA AYUDHAM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

IMG 20241106 WA0230

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

నాచారం, గుండుగులపల్లి, దమ్మపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలనిఅధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో లారీల కొరత లేకుండా చూడాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే సెంటర్లో ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు.
అనంతరం దమ్మపేట మండలం ఆళ్లపల్లి గ్రామంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారుల సమన్వయంతో రాష్ట్ర సరిహద్దుల ద్వారా వరి ధాన్యం అక్రమ రవాణా కాకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీఎం సివిల్ సప్లై బాబు, డి సి ఓ ఖుర్షీద్, దమ్మపేట తాసిల్దార్ నవీన్మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version