గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి : అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
గ్రూప్ 2 పరీక్షలను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అన్నారు.గురువారం ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానం పై చీఫ్ సూపర్డెంట్లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, డిపార్ట్మెంటల్ అధికారులు, లోకల్, జాయింట్ రూట్ అధికారులు మరియు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. ఈనెల 15 మరియు 16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాల్లో 13465 మంది అభ్యర్థులు గ్రూప్ టు పరీక్షకు హాజరుకానున్నారు అని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల 100% బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష హాల్లో ప్రారంభానికి ముందే ఓఎంఆర్ షీట్ పై ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఓఎంఆర్ షీట్ లో అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులు వారి వివరాలను కేటాయించిన ఆయా బ్లాకుల్లో తప్పులు లేకుండా నమోదు చేసేలా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు పనితీరును సరిచూసుకోవాలన్నారు.అభ్యర్థుల హాల్ టికెట్, గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడి కార్డును తప్పనిసరిగా సరి చూడాలన్నారు. ఉద్దేశించిన రూట్ లో మాత్రమే ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ పత్రాలు తీసుకువెళ్లాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వార్డులు, రూట్ అధికారులు, అబ్జర్వర్లు,ఐడెంటిఫికేషన్ అధికారులు, సంబంధిత శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు.
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఐ డి ఓ సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392919706 మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుచేసిన 040-23542185,040-23542187 టోల్ ఫ్రీ నెంబర్లకు ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలనికోరారు.
ఈ అవగాహన సదస్సు లో గ్రూప్ 2 పరీక్షల కన్వీనర్ హరికృష్ణ మరియు డీఎస్పీ ఏఆర్ సత్యనారాయణ ( గ్రూప్ 2 పరీక్షల పోలీస్ నోడల్ అధికారి ) మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment