Site icon PRASHNA AYUDHAM

రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ శనివారం పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను ఆయన పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి,కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని,మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంట వెంటనే జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి త్రినాథ్ బాబు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version