బిబిపేట్ మండలంలో అడిషనల్ కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్లను, పలు శాఖల పనులను స్వయంగా పర్యవేక్షించారు.
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 16
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల పరిధిలో అడిషనల్ కలెక్టర్ పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు, ఇతర శాఖల అమలులో ఉన్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్వ చంద్ర కుమార్, గ్రామ పంచాయతీ ఈవో రమేష్ తో పాటు స్థానిక అధికారులు హాజరయ్యారు.
పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్, బిక్కనూరు సొసైటీ డైరెక్టర్ తోట రమేష్ ప్రజల తరఫున సమస్యలను వివరించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా నీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు బోరు మోటార్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
ప్రజల సమస్యలపై మాజీ సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు కూడా తమ సూచనలు ఇచ్చి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
జెడ్పీ సీఈవో ప్రజల అభ్యర్థనలను గమనించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.