Site icon PRASHNA AYUDHAM

పేదలందరికీ జీ+3 పక్కా ఇళ్లు: అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

IMG 20250725 WA0075

*పేదలందరికీ జీ+3 పక్కా ఇళ్లు: అదనపు కలెక్టర్ రాధిక గుప్తా*

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 25:

చాలీచాలని ఇళ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలందరికీ తెలంగాణ ప్రభుత్వం జీ+3 లేదా జీ+4 అంతస్తులలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా తెలిపారు. ప్రజలు అంగీకరిస్తే సరిపోతుందని ఆమె అన్నారు.

శుక్రవారం ఫిర్యాదిగూడ మండలంలోని భగత్ సింగ్ నగర్ మురికివాడ ప్రాంతాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. అక్కడ చిన్నపాటి ఇళ్లలో నివసించే ప్రజలకు ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి వారిని ఒప్పించేందుకు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నచిన్న స్థలాలలో ఇబ్బంది పడుతున్న వారందరికీ ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించడమే కాకుండా, అవసరమైన మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాలను కూడా కల్పిస్తుందని స్థానిక ప్రజలకు వివరించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మరియు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌ను సందర్శించారు. అక్కడే ఒక మొక్కను కూడా నాటారు. ఈ పర్యటనలో షామీర్‌పేట్, మేడిపల్లి తహసీల్దార్లు యాదగిరిరెడ్డి, హాసినా, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version