వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జులై 26:

వర్షాకాలంలో పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సూచించారు. శనివారం ఆమె షామీర్‌పేటలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తూముకుంట మున్సిపల్ కమిషనర్ జ్యోతి, ఇన్‌ఛార్జ్ డీడబ్ల్యూఓ శారద ఆమెతో ఉన్నారు.

పాఠశాలకు రోజువారీ హాజరు, విద్యాబోధన విధానాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్, పిల్లలతో కూడా మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పడకూడదని కూడా ఆదేశించారు.

పాఠశాల గదులు, వంటగది, పరిసరాలను ఆమె కలియతిరిగి పరిశీలించారు. పాఠశాలకు పలు మరమ్మతులు నిర్వహించాలని ఉపాధ్యాయులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మరమ్మతులకు కావలసిన నిధుల కోసం ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు.

అలాగే, పాఠశాల పరిసరాల్లో అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు ఒక గదిని కేటాయించాలని విద్యాశాఖ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now