విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 5

మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అధికారులను సూచించారు. మంగళవారం ఆమె షమీర్‌పేట మండలంలోని సింగరాయిపల్లి, తూముకుంట గ్రామాలను సందర్శించి ప్రాథమిక పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆమె, వారికి ఆహారం సమయానికి, రుచికరంగా అందుతోందా అని తెలుసుకున్నారు. పాఠశాలల రోజువారీ హాజరు శాతం, మెనూ ప్రకారం ఆహారం అందజేతపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వంటగదులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, తరగతి గదుల్లో విద్యార్థులు శ్రద్ధగా చదివి తమ లక్ష్యాలను సాధించాలని కోరారు.

తరువాత అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన రాధిక గుప్తా, పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరంగా చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment