ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
– అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించే వెంటనే డిస్పోస్ చేయాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణి లో (108)అర్జీలు రావడం జరిగిందన్నారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పై విచారణ త్వరగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం జారీచేసిన కొత్త వెర్షన్ లో చేపట్టాలని తెలిపారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓ లు పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాలో వరి ధాన్యం కొనిగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగాయని, అయ్యా కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపారు. కొన్ని మండలాల్లో రెండుపడక గదుల ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అన్నారు. తహసీల్దార్లు ఆన్లైన్ లో ధరణీ ఫైల్స్ ఫార్వర్డ్ చేస్తున్నారనీ, మాన్యువల్ ఫైల్స్ పంపించడం లేదని అన్నారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీఓ వీణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.