*బోడుప్పల్లో ప్రభుత్వ భూముల పరిశీలన: అక్రమ ఆక్రమణలపై అదనపు కలెక్టర్ సీరియస్!*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 11
మేడిపల్లి మండలంలోని బోడుప్పల్ గ్రామంలో ఉన్న సర్వే నంబరు 63లోని ప్రభుత్వ భూములు మరియు అసైన్డ్ భూములను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, మేడిపల్లి ఎంఆర్ఓ హసీనా కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే నంబరు 63లోని అసైన్డ్ ల్యాండ్‌ను కూడా ఆయన ప్రత్యేకంగా పరిశీలించి, అవసరమైన నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.
అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా భూముల రక్షణకు సమర్థవంతమైన వ్యవస్థను కల్పించాలని ఆయన ఆదేశించారు.