ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర
కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలు, మండల కేంద్రాల పరిధిలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి, అమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అధికంగా లభిస్తుంది తెలిపారు. రైతులు పండించిన తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు.రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అదనపు కలెక్టర్ వేణుగోపాల్
by Naddi Sai
Published On: November 27, 2024 9:56 pm