Site icon PRASHNA AYUDHAM

జిన్నింగ్ మిల్లు, చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విక్టర్

IMG 20251028 175620

జిన్నింగ్ మిల్లు, చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విక్టర్

సరిహద్దు వద్ద సన్నవడ్లు రాష్ట్రంలోకి రాకుండా చర్యలు 

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 28 

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ మంగళవారం మద్నూర్ మండలంలో అంతర రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. తెలంగాణలో వరి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్న నేపథ్యంలో, సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిన కారణంగా, ఇతర రాష్ట్రాల నుండి సన్న వడ్లు రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.

తరువాత జిన్నింగ్ మిల్లును సందర్శించిన అదనపు కలెక్టర్, పత్తి పంట కొనుగోలు, శుభ్రత, భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ కార్యదర్శిని ఆదేశించారు.

ఈ తనిఖీలలో తహసీల్దార్ ఎం.డి. ముజీబ్, సివిల్ సప్లై నాయబ్ తహసీల్దార్ ఖలీద్, రెవెన్యూ, పోలీస్, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version