*భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి*
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 25:
భూభారతి, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా ఆర్డీఓ కీసర కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూభారతి ఆన్‌లైన్ ద్వారా మరియు రెవెన్యూ సదస్సులలో దరఖాస్తుదారులు సమర్పించిన దరఖాస్తులు ఎంతవరకు పరిష్కారమయ్యాయని ఆర్డీఓ ఉపేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను పరిశీలించారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని, దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ఆయన పరిశీలించారు.