ఉపగడ్డ పనులను పరీక్షించిన అదనపు కలెక్టర్ 

ఉపగడ్డ పనులను పరీక్షించిన అదనపు కలెక్టర్

– ఇది చరిత్రత్మక సంపద కాపాడుకోవాలి

IMG 20250312 WA0098

ఆయుధం దోమకొండ

ఈ ఉపగడ్డ చరిత్ర ఆత్మక సంపదని దీనిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అదనపు ( స్థానిక సంస్థల ) కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం దోమకొండ గడికోట ఎదురుగా గల ఉపగడ్డ పనులను పంచాయతీ ద్వారా పరిరక్షణకు ఇచ్చిన అనుమతి ప్రకారం పనులు ఎంత వరకు జరిగినాయనీ పరిశీలించారు. ఈ ఉపగడ్డ ఇక చారిత్రాత్మక వారసత్వ సంపద అని దీనిని పరిరక్షించుకొనే భాద్యత మన అందరిది , ఈ భూభాగం పంచాయతీ పరిధిలోనిది కాబట్టి పంచాయతీ వారు ఇచ్చిన అనుమతులను తక్షణమే అమలు పరచమని మండల అధికారి కి సూచించారు. మండల అధికారి ప్రవీణ్ కుమార్ , పంచాయతీ గ్రామసభ తీర్మానము ప్రకారం జరిగినాయనీ తద్వారా జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ ల ఆదేశాల మేరకే పంచాయితీ వారు సంభందిత ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మండల అధికారి, పంచాయతీ కార్యదర్శి మరో మారు చర్చించి ఉపగడ్డ పరిరక్షణ కార్యక్రమాన్ని కొనసాగించాలని మండలాధికారులకు అదనపు కలెక్టర్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment