*ప్రజావాణికి విశేష స్పందన: 106 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిపై తీసుకున్న చర్యలను ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.