విష జ్వరాల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్..
కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ,విష జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నందున హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు మెరుగుపరిచి అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు జమ్మికుంట ఆసుపత్రికి రూ15 లక్షలు హుజురాబాద్ ఆసుపత్రికి రూ 15 లక్షలు కలిపి 30 లక్షలు ఇప్పటికే మంజూరు చేశామని రాబోయే రోజుల్లో మరింత నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు విష జ్వరాలు అధికంగా వ్యాపిస్తున్నందున ప్రజలందరూ తమ ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశించామని ఆయన చెప్పారు.