విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు

*విఘ్నాలు తొలగించేది వినాయకుడు*

*పలు వినాయక మండపంలో ప్రత్యేక పూజలు*

*కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 10*

ఎక్కడ ఏ కార్యం చేపట్టిన మొదట వినాయకుడికే పూజలు చేయడం ఆనవాయితీ అని, వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్ పట్టణంలోని పలు వినాయక మండపాలను వెలిచాల రాజేందర్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తీగలగుట్టపల్లి, సరస్వతి నగర్, విద్యారణ్యపురి రోడ్ నెంబర్ వన్, శాస్త్రి రోడ్డు, ప్రకాశం గంజ్ టవర్ సర్కిల్, బోయవాడ, భగత్ నగర్ సర్కిల్, కిసాన్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు వినాయక విగ్రహాల వద్ద రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆయచోట్ల మండపాల నిర్వాహకులు నాయకులు ఘనంగా సన్మానించారు వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కరీంనగర్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడినీ వేడుకున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రార్థించారు ఆయా చోట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ మాచర్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్, పోరండ్ల రమేష్, సిటీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, 48 డివిజన్ అధ్యక్షుడు గంగుల దిలీప్ కుమార్, మార్క రాజు, మాడిశెట్టి కిషన్, కట్ట జగన్, పాల్తేపు కిషన్, కీర్తి శ్రీనివాస్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now