*హుజురాబాద్ డివిజన్ ఎస్సీ హాస్టల్స్‌లో ప్రవేశాలు ప్రారంభం*
*ఉచిత విద్య, భోజనం, అన్ని సౌకర్యాలతో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*
*హుజురాబాద్ డివిజన్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డి*
*హుజురాబాద్ జులై 6 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ డివిజన్‌లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
*అందుబాటులో ఉన్న ఖాళీలు*
ప్రీ మెట్రిక్ హాస్టల్స్ (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు):
హుజురాబాద్: బాలురు – 71, బాలికలు – 78,జమ్మికుంట: బాలురు – 35, బాలికలు – 82,వావిలాల: బాలురు – 88,వీణవంక: బాలురు – 70,రేకొండ: బాలురు – 77,చిగురుమామిడి: బాలురు – 81,నుస్తులాపూర్: బాలురు – 72,ఇందుర్తి: బాలురు – 78,తిమ్మాపూర్: బాలికలు – 215,పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ (ఇంటర్, డిగ్రీ, ఇతర విద్య):హుజురాబాద్: బాలురు – 170,జమ్మికుంట: బాలికలు – 130,కల్పించే సౌకర్యాలు:విద్యార్థులకు ఉచిత భోజన వసతి, నోట్‌బుక్స్, నాలుగు జతల దుస్తులు, బెడ్‌షీట్, కార్పెట్, షూస్, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్, బంకర్ బెడ్స్, ప్లేటు, గ్లాసు, ట్రంక్ పెట్టె, దుప్పట్లు, పరుపు, దిండు, స్పోర్ట్స్ షూ, స్కూల్ షూ లాంటి వస్తువులు ఉచితంగా అందజేస్తారు.ప్రతి నెల బాలురకు రూ.150-200, బాలికలకు రూ.175-275 వరకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లిస్తారు.ఆహార వసతి:ప్రభుత్వ మెనూ ప్రకారం రాగి జావ, పాలు, పండ్లు, టిఫిన్, సాయంత్రం స్నాక్స్, వారంలో రెండుసార్లు చికెన్ లేదా బగారా అన్నం, రాత్రి భోజనంలో ఆకుకూరలు, కూరలు, పప్పు, మజ్జిగ, ఉడికించిన గుడ్డు వంటివి అందిస్తారు.
*విద్యా, ఇతర అవకాశాలు:*
పదవ తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, ఆంగ్లం, హిందీ విషయాల్లో ప్రత్యేక కోచింగ్, స్టడీ మెటీరియల్ అందిస్తారు. అలాగే, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా సామగ్రి, టీవీ వసతి, ఉచిత విజ్ఞాన విహారయాత్రలు కూడా లభిస్తాయి.దరఖాస్తు విధానం:విద్యార్థులు దరఖాస్తుతో పాటు 4 ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్ (ఒరిజినల్), ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను సమర్పించాలి.మరిన్ని వివరాలకు:హుజురాబాద్ డివిజన్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డి సంప్రదించాలి