విచ్చలవిడిగా ఏరులై పారుతున్న కల్తీ కల్లు…?
— ఎక్సైజ్ శాఖ అటువైపు ఊసే లేదు..?
— విచ్చలవిడిగా కల్తీతో కుటుంబాల్లో కల్లోలం..!
— పేద మధ్యతరగతి వాళ్ళు టార్గెట్ చేస్తున్న వైనం..?
— యువత వ్యసనానికి అలవాటు..?
–
— పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..?
— తనిఖీల పేరుతో కాలయాపన..?
— కల్తీ బాబులకు మూడు పువ్వులు ఆరు కాయలు
జిల్లా కేంద్రంలోని ఉగ్రవాయి మైసమ్మ పరిధిలో నీ కల్లు దుకాణంలో విచ్చలవిడిగా కల్తీ కల్లు, ఏరులై పారుతుంది. పట్టించుకునే నాధులే లేక కల్తీ మందు బాబులకు మూడు పువ్వులు ఆరు కాయలు గా చలామనవుతున్నారు. వీరికి రాజకీయ అండదండలు ఉన్నాయా లేక అధికారుల అండదండలతో రోజురోజుకు పేట్రేగిపోతున్న వైనం
కల్తీ కల్లు ఇలా తయారు..?
వాస్తవంగా ఈ పరిధిలో ఉన్న దుకాణాలలో గీత కార్మికులు నికార్సేన కళ్ళు ప్రతిరోజు 30 నుండి 40 లీటర్లు మాత్రమే అని సమాచారం. అయితే తదుపరి కల్తీ బాబులు ఈ యొక్క సహజమైన కళ్ళు లో అన్ఫజోలం, డైజీ ఫామ్, యూరియా, నిద్ర మాత్రలకు వాడే రెస్టిల్ 0-5, 0-10, ఈస్ట్, పేస్ట్ డబ్బాలు లాంటి వ్యర్థ పదార్థాలతో ఏర్పాటు చేసిన ద్రవపదార్థాన్ని కల్లుగా మార్చి రోజుకు ఈ యొక్క పరిధిలో ఉన్న దుకాణాలలో సుమారు 3 లీటర్ల నుండి 5వేల లీటర్ల వరకు కల్తీకలు తయారుచేసి అమ్ముతున్న వైనం?
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఈ పరిధిలో ఎక్సైజ్ శాఖ హుసే లేక మందు బాబులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా రోజురోజుకు పేట్రేగిపోదు కల్తీ మయంగా మభ్యపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ , యువతను చెడు దారి పట్టిస్తూ, ప్రజలకు నాణ్యమైన కళ్ళు అమ్మ లేక, ముస్తేదారులు వారికి నచ్చిన వారిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దుకాణాలను నడిపిస్తూ ప్రభుత్వానికి సంబంధం లేని విధంగా, ఎక్సైజ్ శాఖ కళ్ళు కప్పి, ప్రజల ప్రాణాలతో చలాట మాట్లాడుతున్న వైనం.
రోడ్డుకు ఇరువైపులా..!
కల్తీ విచ్చలవిడిగా రాష్ట్ర రహదారి కామారెడ్డి నుండి కరీంనగర్ జిల్లా రెండు జిల్లాలను కలిపే రోడ్డు రహదారిపై విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. జిల్లా కేంద్రానికి కూతవీడు దూరంలో ఈ తతంగం జరుగుతున్న పట్టించుకున్న వైనం లేకపోలేదు. ఎక్సైజ్ శాఖ అటువైపు ఊసే లేదు,..?
రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలలో కల్లోలం..?
కల్తీ కళ్ళు సేవించి డ్రైవింగ్ చేస్తూ రాష్ట్ర రోడ్డుపై అనేక రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్న సందర్భాలు అనేకం అయినా ఈ యొక్క కల్తీకి అడ్డుకట్ట వేయలేని వైనం, ఇలా కల్తీకల్లు సేవించి వాహనాలు నడిపి ఇటు మందుబాబులు అటు రోడ్డుపై ప్రయాణించే ప్రజలు చాలా సందర్భాలలో రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు..?
ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది..?
కాలయాపన చేస్తున్న ఎక్సైజ్ శాఖ ఆ దుకాణాలపై అతి ప్రేమ ఎందుకు, మిగతా షాపులపై సవతి ప్రేమ చూపిస్తూ, ఆ యొక్క గ్రామాల పరిధిలో ఉన్న ముస్తేదారులతో కుమ్మక్కయ్యారా..? అని అనుమానాలు ప్రజలను రేకెత్తిస్తున్నాయి. దీనికి సమాధానంగా ఇప్పుడైనా ఎక్కడైనా ఏ షాప్ లో నైనా తనిఖీలు చేసిన సందర్భంగా లేవు? చేసిన నామమాత్రం గానీ తనిఖీల పేరుతో కాలయాపన?
ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకున్న సందర్భాలు..?
కల్తీ కల్లు ఏరులై పారుతున్నప్పటికీ జిల్లా కేంద్రానికి కూతవీడు దూరంలో ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ప్రొహిబిషన్ అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడని వైనం..? సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు రోడ్డు పాలవుతూ ఆరోగ్యం దెబ్బతిని కుటుంబాలలో, గొడవలకు అనేక కారణాలను రేకిస్తున్న కల్తీకల్లు పై చర్యలు ఎక్కడ? ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ ఆ పరిధిలో ఉన్న దుకాణాలపై కేసులు చేసిన దాఖలాలు లేవు ఎందుకని నికార్సైన కళ్ళు అమ్ముతున్నారని ప్రజలను మభ్యపెడుతున్న ముస్తేదారులు?
సమయపాలనకు అడ్డు అదుపు లేదు..?
సమయపాలన విషయానికి వస్తే ఇష్టం వచ్చిన సమయానికి తీయడం వారికి నచ్చిన అర్థరాత్రి సమయంలో కూడా కళ్ళు దుకాణాలు ఏదేచ్ఛగా నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టానుసారంగా సమయపాలన లేకుండా పట్టించుకున్న దాఖలాలు లేవు
యువత పెడదారి పడుతుంది..?
యుక్త వయసు రాగానే నేటి సమాజంలో యువత వ్యసనాలకు అలవాటు పడి మద్యంపై లేదా కల్లు ను తోటి మిత్రులతో యువకులు సేవించడం వలన వ్యసనానికి అలవాటు పడి ఇటు చదువులు సరిగ్గా చదవక, విద్య ఉపాధి అవకాశాలకు దూరమంటూ కుటుంబాలలో తల్లిదండ్రులకు భారంగా మారి, రోజురోజుకు
యువత తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు.
జిల్లా పాలన అధికారి స్పందించే నా..?
ఇప్పటికైనా యువతని చెడుదారి పట్టనీయకుండా ప్రభుత్వ పాలన అధికారి తక్షణమే చర్యలు తీసుకొని కల్తీ దుకాణాలను తనిఖీ చేయించి శాంపిలను సేకరించి తక్షణమే దుకాణాలను సీజ్ చేయవలసిందిగా మేధావి వర్గం భావిస్తోంది.