న్యాయవాది జనార్దన్ రెడ్డి 14వ మహా పడిపూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు 

చిన్న శంకరంపేట లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ.

న్యాయవాది జనార్దన్ రెడ్డి 14వ మహా పడిపూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు 

శబరిమలై వెళ్లే భక్తులు శబరిమలై లో ఉన్న వామర స్వామిని దర్శనం చేసుకోకూడదని కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప మాలదారులు మాలలు ధరించి ఎంతో నియమనిష్ఠలతో భక్తిశ్రద్ధలతో 48 రోజుల దీక్ష కొనసాగుతుందని మాల వేసిన రోజు నుండి మాల విరమించే వరకు గ్రామాలలో ఉన్న మాలాదారులు శవం కనిపిస్తేనే స్నానమాచరించి శరణు ఘోష చదువుతారు అలాంటప్పుడు శబరిమలై లో ఉన్న దర్గాను దర్శించుకోవడం ఎందుకని పూజారి రాజు పంతులు అన్నారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలో ప్రముఖ న్యాయవాది జనార్దన్ రెడ్డి 14వ మహా పడిపూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు పడిపూజ లో భాగంగా పూజా ప్రాంగణమంతా అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయింది భక్తుల భజన సంకీర్తనలను చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి మహా పడిపూజకు మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీ శారదా,సెక్రటరీ లీగల్ సర్వీసెస్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జ్ సిరి సౌజన్య,లు పూజలో పాల్గొన్నారు రాజు పంతులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు పూజారి రాజు పంతులు మాట్లాడుతూ కార్తిక మాసం అతి పవిత్ర మాసమైందని అయ్యప్ప మాలదారులు కార్తీక మాసంలోనే మాల ధరించడం జరుగుతుందని హిందూ సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించాలని ఆయన భక్తులకు సూచించారు, కత్తెరతో చింపిన దుస్తులు పూజకు పనికిరాని ఎక్కడ పూజకు వెళ్లిన దేవాలయాలకు వెళ్లిన సాంప్రదాయ దుస్తులతోనే పూజలు పాల్గొనాలని అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పూజారి రాజు పంతులు తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అయ్యప్ప మాలదారుడు జనార్దన్ రెడ్డి, కృష్ణమూర్తి గురుస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, శ్రీమాన్ రెడ్డి,రాజిరెడ్డి, వెంకటరెడ్డి, జీవన్, రమేష్ గౌడ్ స్వామీ, జీవన్ స్వామి, గోవింద్ స్వామి, చిన్న శంకరంపేట మండల స్వాముల తో పాటు పరిసర ప్రాంత మండలాల నుండి మాలదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment