కాసిపేటలో అఘోరీలు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో అఘోరీలు ప్రత్యక్షమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యలో అన్ని దేవాలయాలను దర్శించుకుంటున్నారు. కాగా కాసిపేట కోదండ రామాలయంలో స్వామిని దర్శించుకున్నారు. స్థానికులు భారీగా తరలివచ్చి అఘోరీలను వీక్షించారు.